మరోవైపు హైదరాబాద్ పరిధిలో 144 సెక్షన్ (ప్రస్తుతం సెక్షన్ 163 ) విధిస్తున్నట్లు హైదరాబాద్ సీపీ సి.వి.ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు గుమిగూడడం, ఊరేగింపులు, ధర్నాలు, ర్యాలీల బహిరంగ సభలపై నిషేధం విధించినట్లు సీపీ నోటిఫికేషన్ జారీ చేశారు. ప్రజా భద్రతను దృష్టిలో పెట్టుకుని అక్టోబర్ 27 నుంచి నవంబర్ 28 వరకు నెల రోజుల పాటు హైదరాబాద్ నగరం అంతటా బహిరంగ సభలు, ధర్నాలు, నిరసనలు నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.