ముగిసిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ నిర్వహించిన గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-1 ప్రధాన పరీక్షల్లో 67.17శాతం హాజరు నమోదైందని టీజీపీఎస్సీ కార్యదర్శి ప్రకటించారు. గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్షల్లో మొత్తం ఏడు పేపర్లకు 21,093 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ నెల 21 నుంచి నిర్వహించిన పరీక్షలు ఆదివారం 27వ తేదీతో ముగిశాయి. మొత్తం 563 పోస్టుల భర్తీకి నిర్వహించిన గ్రూప్-1 మెయిన్స్‌ పరీక్షలకు మొత్తం 31,403 మంది అర్హత పొందారు. వీరిలో హైకోర్టు అనుమతితో పరీక్షలకు హాజరైన 20 మంది స్పోర్ట్స్ క్యాటగిరీ అభ్యర్థులు కూడా ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here