తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్(rajinikanth)నుంచి ఈ నెల అక్టోబర్ పది న వరల్డ్ వైడ్ గా విడుదలైన మూవీ వేట్టయన్(vettaiyan)సూర్యతో జై భీం(jai bhim)వంటి హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన జ్ఞానవేల్ రాజా( tj jnanavel raja)దర్శకుడు కాగా అమితాబ్ బచ్చన్, రానా, ఫాహద్ ఫాజిల్, దుషారా విజయన్, మంజు వారియర్ లు ముఖ్య పాత్రల్లో కనిపించారు.ఇక మొదటి ఆట నుంచే మంచి సోషల్ మెసేజ్ ఉన్న చిత్రమనే టాక్ ని పొందిన వేట్టయన్  కలెక్షన్స్ పరంగా కూడా పర్వాలేదని అనిపించుకుంది.  


ఇప్పుడు ఈ మూవీ ఓటిటి రిలీజ్ కి సంబంధించిన న్యూస్ ఒకటి బయటకి వచ్చింది.అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా  నవంబర్ 7 నుంచి స్ట్రీమింగ్  కాబోతుందనే వార్తలు వస్తున్నాయి.ఇందుకు సంబంధించి త్వరలోనే అధికార ప్రకటన కూడా రానుందని అంటున్నారు.రజనీకాంత్ ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా అత్యద్భుతంగా చెయ్యగా అమితాబ్ మానవ హక్కులని కాపాడే రిటైర్డ్ జడ్జి గా మరో సారి తన సత్తా చాటాడు. రానా కూడా ఒక పవర్ ఫుల్ విలన్ పాత్రలో ఒక రేంజ్ పెర్ ఫార్మ్ ని ఇచ్చాడు.

 హంతకుల విషయంలో పోలీసులతో పాటు ప్రపంచం చూసే కోణంలో ఎప్పుడు నిజం ఉండదని చెప్పిన వేట్టయన్ ని లైకా ప్రొడక్షన్స్‌ పై సుభాస్కరన్(subhaskaran)నిర్మించగా అనిరుద్ సంగీతాన్ని అందించాడు.

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here