లేడీ సూపర్ స్టార్ అనే టాగ్ లైన్ ని పొందిన అతి కొద్దీ మంది హీరోయిన్స్ లో నయనతార(nayanthara)కూడా ఒకటి.రెండు దశాబ్దాల నుంచి తనదైన నటనతో దక్షిణ భారతీయ సినీ ప్రేమికులని అలరిస్తున్న వస్తున్న నయనతార, జవాన్ తో బాలీవుడ్ లోకి కూడా అడుగుపెట్టి భారీ హిట్ ని అందుకుంది.ప్రస్తుతం మలయాళంలో డియర్ స్టూడెంట్ తో పాటు తమిళ్ లో జయం రవి తో  కలిసి తని ఓరియన్ పార్ట్ 2 లో చేస్తుంది. ఇంకో మూడు భారీ సినిమాలకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

 నయనతార తన ముఖానికి ప్లాటిక్ సర్జరీ చేయించుకుందనే రూమర్స్ సోషల్ మీడియాలో వస్తు ఉన్నాయి.రీసెంట్ గా ఆ రూమర్స్ పై  ఒక ఆంగ్ల మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో నయన్ మాట్లాడుతు నా కనుబొమ్మలంటే నాకు చాలా ఇష్టం. ప్రతి రెడ్ కార్పెట్ ఈవెంట్లకి ముందు వాటి ఆకారాన్ని మారుస్తూ ఉంటాను.అందుకోసం ఎంతో సమయాన్ని  వెచ్చిస్తాను.కనుబొమ్మల ఆకారం మారినప్పుడల్లా నా ముఖంలో మార్పు వస్తుంది.

బహుశా ఈ కారణంతోనే నా ముఖంలో మార్పులు వచ్చాయని అందరు అనుకుంటూ ఉంటారు. అంతే కానీ ప్లాస్టిక్ సర్జరీ అనేది నిజం కాదు.డైటింగ్ వలన  కూడా నా ముఖంలో మార్పులు వచ్చి ఉండవచ్చు.ఒక్కోసారి బుగ్గలు వచ్చినట్టు కనిపించి మరోసారి లోపలకి వెళ్లినట్టు కనిపిస్తాయి.కావాలంటే మీరు నన్ను గిచ్చి చూడవచ్చు,నా బాడీ లో ఎక్కడా ప్లాస్టిక్ ఉండదని చెప్పుకొచ్చింది. ప్రముఖ దర్శకుడు విగ్నేష్(Vignesh Shivan)ని పెళ్లి చేసుకున్న నయనతార సరోగసి ద్వారా ఇద్దరు మగ కవలలకు జన్మ నిచ్చిన విషయం తెలిసిందే.

 

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here