ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌(pawan kalyan)ని ప్రముఖ తమిళ నటుడు, డైరెక్టర్ పార్థిబన్(parthiban)కలవడం ప్రాధాన్యత   సంతరించుకుంది. మంగళగిరిలోని డిప్యూటీ సీఎం కార్యాలయానికి వెళ్లిన పార్తీబన్ ని  పవన్ కళ్యాణ్ సత్కరించాడు. అనంతరం పలు అంశాల గురించి ఇద్దరూ చర్చించుకున్నట్లు తెలిసింది. ఈ భేటీ ఫోటోలను జనసేన పార్టీ తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా షేర్ చేసుకుంది. 

 పార్థిబన్ కూడా పవన్ కళ్యాణ్‌కు జ్ఞాపికని  అందించడంతో పాటు ఒక పుస్తకాన్ని కూడా బహూకరించాడు.అయితే  సినిమా విశేషాల గురించి మాట్లాడటానికి కలిసాడా  లేదా డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించినందుకు అభినందించేందుకు కలిశాడా అనే విషయంలో అందరిలో ఆసక్తి నెలకొని ఉంది.నిన్న  విజయ్  ఫస్ట్ పొలిటికల్ మీటింగ్ జరిగిన నేపథ్యంలో కూడా ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.వితాగన్, అజగి, అంబులీ,కన్నడి పోకల్, పుడీయా పాదై, ది వొర్టెక్స్, కేని, పోనంగల్ వందల్ వంటి చిత్రాలు నటుడుగా పార్తీబన్ కి  మంచి పేరు తెచ్చిపెట్టాయి.

పదహారు చిత్రాలకి కూడా  దర్శకత్వం వహించిన  పార్తీబన్  తెలుగులో రామ్ చరణ్ హీరోగా వచ్చిన రచ్చ, అంతఃపురం వంటి  సినిమాల్లో  కూడా నటించాడు. పార్తీబన్ భార్య సీత  తెలుగులో ఎన్నో చిత్రాల్లో హీరోయిన్ గా చేసింది.

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here