మలయాళంలో ఈ ఏడాదిలో ఇంతవరకు విడుదలైన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రాలలో ‘గోళం’ ఒకటి. సంజాద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, రంజిత్ సంజీవ్ – దిలీష్ పోతన్ ప్రధానమైన పాత్రలను పోషించారు. జూన్ 7వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, ఆగస్టు 9వ తేదీన అమెజాన్ ప్రైమ్ ఫ్లాట్ ఫామ్ పైకి వచ్చింది. అప్పటి నుంచి మలయాళంలో మాత్రమే ఈ సినిమా అందుబాటులో ఉంది. రీసెంటుగా తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లోను అందుబాటులోకి వచ్చింది. 

ఒక చిన్నపాటి ఆఫీసులోని వాష్ రూమ్ లో బాస్ చనిపోతాడు. ఆ సమయంలో ఆ ఆఫీసుకి కొత్తగా ఎవరూ రాలేదు. ఉన్న ఎంప్లాయిస్ అంతా సీసీటీవీ కెమెరాల పరిధిలోనే ఉన్నారు. బాస్ చనిపోయిన ప్రదేశంలో ఎలాంటి ఆధారాలు లభించవు. కానీ అతనిది హత్య కావొచ్చనే ఒక అనుమానం పోలీస్ ఆఫీసర్ కి ఉంటుంది. ఆయన అనుమానం నిజమేనా? అనే ఒక మర్డర్ మిస్టరీ చుట్టూ ఈ కథ తిరుగుతూ ఉంటుంది.  

సాధారణంగా హారర్ థ్రిల్లర్ జోనర్ కి సంబంధించిన కథలను ఒక ఇంట్లో ప్లాన్ చేసి, తక్కువ బడ్జెట్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తుంటారు. కానీ ఇలాంటి ఒక నేపథ్యంతో .. సింపుల్ కంటెంట్ ను బలంగా చెప్పడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. విజయ్ ఫొటోగ్రఫీ, అబీ సాల్వన్ థామస్ నేపథ్య సంగీతం, మహేశ్ భువనేంద్ ఎడిటింగ్ మంచి అవుట్ పుట్ ను అందించింది.

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here