తొలివిడతలో 129 సూక్ష్మ, చిన్న తరహా ప్రాజెక్టులను వ్యక్తిగతంగా ఏర్పాటు చేస్తామని ఆసక్తి చూపిన వారికి ప్రభుత్వం కేటాయించింది. వీరిలో 64 మంది మహిళలు కొత్తగా పరిశ్రమలు ఏర్పాటుచేస్తున్నారు. మరో 65 మంది ఇప్పటికే ఉన్న బిజినెస్ ను మరింతగా విస్తృతపరుచుకుంటున్నారు. త్వరలో ఏర్పాటు చేయనున్న పరిశ్రమలలో… జీడిపప్పు ప్రాసెసింగ్ యూనిట్లు, బెల్లం ఉత్పత్తి, ఆయిల్ మిల్లు, హైజిన్ ప్రొడక్ట్స్, మిల్లెట్ అండ్ హెర్బల్ యూనిట్, బేకరీ, స్నాక్స్ యూనిట్, డెయిరీ ఫాం, కిరాణా షాపులు, పచ్చళ్ల తయారీ, సిమెంట్ బ్రిక్స్ యూనిట్, ఎంబ్రాయిడరీ, ఐస్క్రీమ్ తయారీ, గార్మెంట్స్, తేనే తయారీ, కారంపొడి తయారీ ఉన్నాయి.
Home Andhra Pradesh డ్వాక్రా మహిళలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, రూ.55 కోట్లతో 129 పరిశ్రమల ఏర్పాటు- భారీ...