దీపావళి అయిదు రోజుల పండుగ. ధనత్రయోదశితో ఈ పండుగ మొదలవుతుంది. ప్రతిరోజూ ఒక్కో సంప్రదాయాన్ని పాటిస్తారు. అయిదు రోజుల్లో ప్రతిరోజూ లక్ష్మీదేవిని పూజించడం చాలా ముఖ్యం. ధంతేరస్ నుండి ప్రారంభమయ్యే ఈ పండుగ మీకు, మీ సన్నిహితులకు శుభదాయకమైన సమయం. మీకు, మీ స్నేహితులకు, బంధువులకు అంతా మంచే జరగాలని కోరుకుంటూ ధన త్రయోదశికి తెలుగులో శుభాకాంక్షలు పంపండి. కొన్ని మెసేజులను ఇక్కడ అందించాము. మీకు నచ్చినదాన్ని ఎంపిక చేసుకుని మీ ప్రియమైన వారికి పంపించండి.