త్వరలోనే మైనింగ్ పాలసీ
రాష్ట్రంలో త్వరలోనే బెస్ట్ మైనింగ్ పాలసీ తీసుకువస్తామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. స్టోన్ క్రషర్స్, మిల్లర్స్ నిర్వహకులతో సమావేశం నిర్వహించామన్నారు. వైసీపీ హయాంలో మైనింగ్ మంత్రి బెదిరింపులకు పాల్పడి మైనింగ్ ను పూర్తిగా తన సొంతం చేసుకున్నారని ఆరోపించారు. తన వినకపోతే అధికారులను పంపించి అక్రమంగా కేసులు బనాయించారని తెలిపారు. గత ప్రభుత్వం వేధింపులతో అనేక క్వారీలు మూతపడ్డాయన్నారు. వైఎస్ జగన్, పెద్దిరెడ్డి కలిసి రాష్ట్ర ఆదాయానికి గండి కొట్టారని ఆరోపించారు. గత ఐదేళ్లలో ఇసుకను అక్రమంగా దోచుకున్నారన్నారు. భవన నిర్మాణ రంగం పూర్తిగా దెబ్బతిందన్నారు.