పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(prabhas)కమిట్ అయిన మూవీస్ లో స్పిరిట్(spirit)కూడా ఒకటి.సందీప్ రెడ్డి వంగ(sandeep reddy vanga)దర్శకుడు కావడంతో ఈ మూవీపై ప్రభాస్ అభిమానుల్లోను,ప్రేక్షకుల్లోను భారీ అంచనాలే ఉన్నాయి.చిత్ర బృందం అధికారకంగా ప్రకటించకపోయినప్పటకి ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా చేయబోతున్నాడనే వార్తలు అయితే చాలా రోజుల నుంచి వినిపిస్తున్నాయి. 

తాజాగా ఈ మూవీ నుంచి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.ప్రభాస్(prabhas)పాత్ర పోలీస్ కావడంతో పాటుగా కథలో మలుపులు కారణంగా ఆ తర్వాత గ్యాంగ్ స్టర్ గా మారుతుందనే వార్తలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.  తద్వారా  భారీ వైల్డ్ ఎలిమెంట్స్ సినిమాలో ఫుల్ గా ఉండబోతున్నాయని, ఇండియన్ సిల్వర్ స్క్రీన్ వద్ద ఇంతవరకు అలాంటి వేరియేషన్స్ ఉన్న క్యారక్టర్  రాలేదనే మాటలు కూడా వినిపిస్తున్నాయి.అంతే కాకుండా ప్రభాస్ కి విలన్ గా మరో స్టార్ హీరో చేయబోతున్నాడనే న్యూస్ కూడా బాగానే స్ప్రెడ్ అవుతుంది.

ఇక ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది నుంచి ప్రారంభం కానుంది. దాదాపు నాలుగు వందల  కోట్లకు పైగా బడ్జెట్‌తో సందీప్ రెడ్డి వంగ తన సొంత బ్యానర్ భద్రకాళి పిక్చర్స్ పై నిర్మిస్తుండగా, మరో ప్రతిష్టాత్మక సంస్థ టి సిరీస్ కూడా వన్ అఫ్ ది ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తోంది. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతాన్ని అందిస్తుండగా అన్ని భాషలకి చెందిన నటులు స్పిరిట్  లో చెయ్యబోతున్నారు.ప్రభాస్ అయితే ప్రస్తుతం రాజా సాబ్(raja saab)తో బిజీగా ఉన్నాడు. వచ్చే ఏడాది ఏప్రిల్ 10 న ఆ మూవీ విడుదల కాబోతుంది. హను రాఘవపూడి మూవీ తో పాటు సలార్ 2(salaar 2)కూడా ప్రభాస్ లిస్ట్ లో ఉన్నాయి.

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here