లక్ష్మీదేవి గర్వం
సంపద, సంతోషం, శ్రేయస్సు, ఆనందం, సంతానం, సౌభాగ్యం వంటి అనేక వాటికి ప్రతీకగా లక్ష్మీదేవిని ఆరాధిస్తారు. ఒకనాడు వైకుంఠంలో విష్ణువు, లక్ష్మీదేవి మధ్య దీని గురించి మాటలు వచ్చాయి. అప్పుడు తాను సంపదకు అధిదేవతను అంటూ లక్ష్మీదేవి గర్వం వ్యక్తం చేసింది. ‘సంపద, శ్రేయస్సు, అదృష్టం, సమృద్ధిని ప్రసాదిస్తాను. నా దీవెనలు భక్తులకు అన్ని రకాల ఆనందాలను అందిస్తాయి’ అని పొగరుగా మాట్లాడిందట. దీంతో ఆమె గర్వాన్ని పసిగట్టిన విష్ణుమూర్తి తనకు బుద్ధి వచ్చేలా చేయాలని అనుకున్నారు. అవును కానీ ఎన్ని ఉన్నా ఏం ప్రయోజనం నిజమైన స్త్రీ అంటే మాతృత్వంతో నిండిన ఆనందం మాత్రమే వస్తుంది. నీకు అది లేదు కదా అని అన్నాడట.