విజ‌య‌వాడ‌లోని వాంబే కాల‌నీలో దారుణం జరిగింది. పోలీసుల క‌థ‌నం ప్ర‌కారం.. వాంబే కాల‌నీకి చెందిన గుంటు ర‌మేష్ స్థానికంగా ఉండే ఓ యువ‌తితో వివాహేత‌ర సంబంధం పెట్టుకున్నాడు. ఆమె భ‌ర్త రెండేళ్ల క్రిత‌మే చ‌నిపోగా.. అప్ప‌టి నుంచి ర‌మేష్‌తో క‌లిసి ఉంటోంది. ఈ క్ర‌మంలోనే యువ‌తి త‌ల్లితో ప‌లుమార్లు గొడ‌వ‌ప‌డి ఆమెపై దాడి చేశాడు. ఈసారి గొడ‌వ‌ప‌డి బ్లేడ్‌తో ముఖంపై దాడి చేశాడు. ఆమె కుమారుడు, యువ‌తి సోద‌రుడు ప్ర‌శ్నించ‌గా అత‌డిపై కూడా ర‌మేష్ దాడి చేశాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here