మాస్ మహారాజా రవితేజ(ravi teja)నుంచి గత ఆగస్ట్ 15 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ మిస్టర్ బచ్చన్(mister bachchan)పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టిజీ విశ్వప్రసాద్ నిర్మించగా హరీష్ శంకర్(harish shankar)దర్శకత్వం వహించాడు.మిరపకాయ్ లాంటి సాలిడ్ హిట్ తర్వాత రవితేజ,హరీష్ ల కాంబోలో ఎన్నో అంచనాల మధ్య విడుదలయ్యి భారీ డిజాస్టర్ ని అందుకుంది. 

దీంతో రవితేజ తదుపరి చిత్రంపై అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు.ఇప్పుడు ఆ మూవీ షూటింగ్ హైదరాబాద్ పరిసరాల్లో కొత్త షెడ్యూల్ ని ప్రారంభించుకుంది.చిత్ర దర్శకుడు భాను బోగవరపు(bhanu bhogavarapu)ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. ఈ షెడ్యూల్ లో కథకి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలని చిత్రీకరించబోతున్నారని, ఇందులో రవితేజతో పాటు ముఖ్య తారాగణం మొత్తం పాల్గొనబోతుందని తెలుస్తుంది.ఇక ఈ మూవీలో రవితేజ సరసన శ్రీలీల(sreeleela)హీరోయిన్ గా చేస్తుండంతో ప్రేక్షకుల్లో కూడా ఈ ప్రాజక్ట్ ఒక ప్రత్యేకతని సంతరించుకుంది.

ఎందుకంటే  గతంలో రవితేజ, శ్రీలీల కాంబోలో వచ్చిన ధమాకా మంచి విజయాన్ని అందుకోవడంతో పాటుగా, అందులోని పల్సర్ బైక్ సాంగ్ ఎంతగా సంచలనం సృష్టించిందో అందరకి తెలిసిందే.నేటికీ చాలా ఫంక్షన్స్ లో ఆ సాంగ్ మోతమోగిపోతూ ఉంది. ఈ మూవీలో కూడా అలాంటి  సాంగ్ ఒకటి ఉండబోతుందనే వార్తలు వస్తున్నాయి.పైగా ఆ సినిమాకి సంగీతాన్ని అందించిన భీమ్స్  సిసిరోలియా నే ఈ మూవీకి కూడా సంగీతాన్ని అందిస్తున్నాడు. సితార ఎంటర్ టైన్మెంట్స్(sitara entertainements)పై  నాగవంశీ నిర్మిస్తుండగా లక్ష్మణ్ భేరి అనే ఆర్పీఎఫ్ అధికారిగా రవితేజ కనిపించనున్నాడనే వార్త అయితే ప్రచారంలో ఉంది.

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here