వైవీ సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి చెప్పేవి అసత్యాలు
“వైవీ సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి, ఇతరులు… వాళ్లు మాట్లాడుతున్నది వైఎస్ఆర్ గురించి అని మరిచి, ఆయన కుటుంబ పరువు తీస్తున్నారన్న స్పృహ లేకుండా.. ఎన్నో అసత్యాలు చెప్పారు. వైఎస్ఆర్ బతికి ఉండగానే ఆస్తులు పంచేశారని అన్నారు. ఇది అవాస్తవం. వైఎస్ఆర్ పిల్లలు ఇద్దరు పెరుగుతున్న రోజుల నుంచి, కొన్ని ఆస్తులు షర్మిల పేరు మీద.. అలాగే కొన్ని ఆస్తులు జగన్ పేరు మీద పెట్టారు. అది ఆస్తులు పంచడం ముమ్మాటికీ కాదు. వైఎస్ఆర్ బతికి ఉండగానే షర్మిలకు ఆస్తులు ఇచ్చేశారు, జగన్ పేరు మీద పెట్టిన ఆస్తుల లిస్ట్ అంటూ కొందరు మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్ చేసింది పంపకం కాదు. కొన్ని ఆస్తులు ఇద్దరు బిడ్డల పేరు మీద పెట్టారు అంతే” – విజయమ్మ