మూడు రాష్ట్రాలను కుదిపేసిన భారీ వర్షాలు
అంతకు ముందు నుంచే.. అంటే దాదాపు వారం రోజులుగా.. రాష్ట్ర (నాటి ఉమ్మడి ఆంధ్రప్రేదేశ్ ) వ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. అప్పటికే ఏపీ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో వరదలు అల్లకల్లోలం సృష్టించాయి. మూడు రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో ప్రాణాలు పోయాయి. భారీ ఆస్తి నష్టం జరిగింది. చాలా చోట్ల రోడ్డు మార్గాలు బంద్ అయ్యాయి. రైల్వే ట్రాకుల మీది నుంచి వరదలు పారుతున్నాయి. ఆ రాత్రి రేపల్లె – సికింద్రాబద్ డెల్టా ఎక్స్‌ప్రెస్ ఘట్కేసర్ స్టేషన్‌కు చేరుతుందనగా.. ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని రామన్నపేట – వలిగొండ చిన్న స్టేషన్ల మధ్య ఉన్న గొల్లపల్లి గ్రామ సమీపంలో 2005 అక్టోబరు 29వ తేదీ రాత్రి డెల్టా రైల్ ఇంజన్, దాని వెనుకే ఉన్న ఏడు బోగీలు చీకటిలో మాయం అయ్యాయి. మిగిలిన పది బోగీల్లో కనీసం నాలుగు బోగీలు పక్కనే ఉన్న పొలాల్లో గాల్లోకి లేచాయి. హాహా కారాలు.. అరుపులు.. ఏం జరిగిందో తెలిసే లోపో గాఢ నిద్రలో ఉన్న వందకు పైగా ప్రాణాలు గాలిలో కలిశాయి. వందలాది మంది గాయాలతో మిగిలిపోయారు. కొన్ని వందల కుటుంబాల్లో.. డెల్టా ప్రమాదం నిప్పులు పోసింది..!