‘నాడు వలసల వనపర్తి నేడు వరి కోతల వనపర్తి అయ్యింది. గతంలో నీళ్లు లేక వనపర్తి నుండి పాలమూరు నుండి రైతులు వలసలు వెళ్ళేవారు. కానీ కేసీఆర్ హయాంలో నిరంజన్ రెడ్డి మంత్రిగా కాలువలు తవ్వించి, ప్రాజెక్టులు కట్టి వలసల వనపర్తిని వరి కోతల వనపర్తిగా తీర్చిదిద్దారు. గతంలో వనపర్తి జిల్లాలో కేవలం 10 వేల ఎకరాల్లో వరి పంట పండిస్తే, కేసీఆర్ హయాంలో 1 లక్ష 10 వేల ఎకరాల్లో వరి పంట వేశారు. ఇప్పుడు వనపర్తిలో ఎక్కడ చూసినా వరి పంటలు, చెరువుల్లో నీళ్లు నిండి ఉన్నాయి’ అని హరీష్ రావు వ్యాఖ్యానించారు.