కంగువపై మూవీ టీమ్ గట్టి నమ్మకంతో ఉంది. ఈ చిత్రం రూ.2,000 కోట్లు సాధిస్తుందని అంచనా ఉందని నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా ఇటీవల చెప్పారు. స్టూడియో గ్రీన్ పతాకంపై ఆయన ఈ చిత్రాన్ని ప్రొడ్యూజ్ చేశారు. యూవీ క్రియేషన్స్ కూడా సహ నిర్మాతగా ఉంది. ఈ చిత్రాన్ని సుమారు రూ.300 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మించినట్టు అంచనా. కంగువ మూవీలో సూర్యతో పాటు బాబీ డియోల్, దిశా పటానీ, నటరాజన్ సుబ్రమణియం, రెడిన్ కింగ్స్లే, యోగిబాబు, వత్సన్ చక్రవర్తి కీలకపాత్రలు చేశారు. ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
Home Entertainment Kanguva Runtime: సూర్య ‘కంగువ’ సినిమా ఫైనల్ రన్టైమ్ ఫిక్స్.. తెలుగు థియేట్రికల్ హక్కులు ఎన్ని...