మా తమ్ముడు ఆపదల ఉన్నప్పుడు పోలీసోళ్లకు చెప్పినా పట్టించుకోలేదని మారు గంగారెడ్డి అక్క రాధ నిలదీశారు. ఇవాళ మీ వెంట 60 మంది పోలీసోళ్లు ఏం జేయ వచ్చిన్రు? సచ్చిపోయిన నా తమ్ముడు ఇప్పుడు లేచి వస్తడా అని మంత్రి శ్రీధర్‌బాబును ప్రశ్నించారు. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ఠాకూర్‌తో కలిసి జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్‌లో గంగారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించగా ఆమె ఇలా స్పందించారు.