రవిశంకర్ అనే వ్యక్తిని లెండ్యాల సురేష్ కు కుమారుడిగా సృష్టించారు. ఆధార్ కేంద్రం ఆపరేటర్‌గా నరేంద్ర సాయంతో హరీశ్ అనే వ్యక్తిని రవిశంకర్‌గా చూపించి ఫేక్ పాన్‌కార్డు తయారు చేశారు. ఈ పాన్ కార్డు సాయంతో ఆధార్‌లో మార్పులు చేశారు. 2023 ఫిబ్రవరిలో కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్ట్రార్ జ్యోతి సాయంతో…బీఆర్ఎస్ నేత పద్మజారెడ్డి సోదరికి ఈ స్థలాన్ని రవిశంకర్ అమ్మినట్లు రిజిస్ట్రేషన్ చేయించారు. తన స్థలం కబ్జా చేశారని యజమాని లెండ్యాల సురేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తులో అసలు విషయం వెలుగుచూసింది. నకిలీపత్రాలు, ల్యాప్‌టాప్‌లు, స్కానర్ ఇతర పరికరాలను సీజ్ చేశారు.