రూమర్లకు పూర్తిగా చెక్
సూర్య, జ్యోతిక మధ్య విభేదాలు వచ్చాయని, అందుకే ముంబైకు మారారనే రూమర్లు వచ్చాయి. వారిద్దరూ విడాకులు తీసుకోనున్నారని, అందుకే పుట్టింటికి జ్యోతిక వెళ్లారంటూ ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. అయితే, ఇప్పుడు ఈ మాటలతో ఈ రూమర్లకు పూర్తిగా చెక్ పెట్టేశారు సూర్య. జ్యోతికతో తన అనుబంధం ఎంత గొప్పదో, ఆమె గురించి తాను ఎంత బాగా ఆలోచిస్తానో వివరించారు. సూర్య మాటలకు సోషల్ మీడియాలో ప్రశంసలు దక్కుతున్నాయి.