దీపాలు ఇక్కడ వెలిగించండి
దీపావళి రోజు రాత్రి ఆలయంలో ఖచ్చితంగా ఆవు నెయ్యి దీపం వెలిగించండి. దీని వల్ల అప్పుల నుండి తక్షణ ఉపశమనం లభిస్తుందని, ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయని నమ్ముతారు. ఈ రాత్రి లక్ష్మీపూజ సమయంలో రెండవ దీపాన్ని వెలిగించండి. మూడవ దీపం తులసి దగ్గర, నాల్గవది తలుపు వెలుపల, ఐదవది రావి చెట్టు క్రింద, ఆరవది సమీపంలోని గుడిలో, ఏడవది చెత్త కుండీలు ఉంచే ప్రదేశంలో, ఎనిమిదోది బాత్రూమ్లో, తొమ్మిది, పదోది ప్రహరీగోడపై వెలిగించాలి. పదకొండవది కిటికీ మీద, పన్నెండవది పైకప్పు మీద, పదమూడవది కూడలిలో పెట్టండి. పూర్వీకులకు, యముడికి దీపదానం చేయడంతో పాటు వంశదేవతకు దీపాలు వెలిగించాలి.