సుహాస్(suhaas)సంగీర్తన విపిన్ హీరో హీరోయిన్లుగా అక్టోబర్ పన్నెండున థియేటర్స్ లోకి అడుగుపెట్టిన మూవీ జనక అయితే గనక(janaka aithe ganaka)దిల్‌రాజు(dil raju)సమర్పణలో  హర్షిత్‌ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మించగా సందీప్‌రెడ్డి బండ్ల(sandeep reddy bandla)దర్శకత్వం వహించాడు.రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్, గోపరాజు రమణ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించగా విజయ్ బుల్గానిన్సంగీతాన్ని అందించాడు.

ఇప్పుడు ఈ మూవీ  ఓటిటి రిలీజ్ డేట్ లాక్ అయ్యింది. స్ట్రీమింగ్ హక్కులని సొంతం చేసుకున్న ఆహా నవంబర్ 8 నుంచి స్ట్రీమింగ్ కి తీసుకురానుంది.ఈ  విషయాన్నీ ఆహా యాజమాన్యం అధికారకంగా ప్రకటించింది. ఈ మూవీ  కథ విషయానికి వస్తే బిడ్డలు పుడితే ఖర్చులు పెరుగుతాయనే భయపడే ఓ కుర్రాడు, భార్య నెల తప్పిందని చెప్పడంతో షాకవుతాడు. తాను కండోమ్ ఉపయోగించినప్పటికీ తండ్రి కావడంతో  షాక్ కి  గురయ్యి  కండోమ్ కంపెనీపై కేసు వేస్తాడు. ఆ తర్వాత ఏమైందన్నదే ఈ సినిమా కథ.

 


 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here