తాజాగా తిరుపతిలోని 8 హోటళ్లకు బాంబు బెదిరింపు బెయిల్స్ వచ్చాయి. మంగళవారం రాత్రి 9.30 గంటల నుంచి అర్ధరాత్రి వరకు వరుసగా తిరుపతిలోని హోటళ్లకు బెదిరింపు ఈ-మెయిల్స్ వచ్చాయి. గతంలో బాంబు బెదిరింపులే రాగా….తాజాగా గ్యాస్ లైన్, వాటర్ పైపు లైన్లు, మురుగునీటి పైపుల్లో పేలుడు పదార్థాలు ఉంచామని మెయిల్స్ రావడంతో హోటళ్ల నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చక్రి, తాజ్, బ్లిస్, పాయ్ వైస్రాయ్, మినర్వా, రీనెస్టు, గోల్డెన్ దులిఫ్, రమీ గెస్ట్లో లైన్ హోటళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. హోటళ్ల నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించడంతో…డీఎస్పీ వెంకటనారాయణ ఆధ్వర్యంలో పోలీసులు, డాగ్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్ హోటళ్లను తనిఖీ నిర్వహించారు. హోటళ్లలో ఎక్కడా పేలుడు పదార్థాలు లేవని తేల్చారు. ఇవన్నీ ఫేక్ మెయిల్స్ అని నిర్థారించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here