సాయిశ్రద్ధ నార్నూర్ మండలంలోని ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలో 10వ తరగతి వరకు చదివింది. అనంతరం ప్రభుత్వ కార్పొరేట్ స్కీమ్ సాయంతో వరంగల్ లో ఇంటర్మీడియేట్ పూర్తిచేసింది. డాక్టర్ కావాలనే తన జీవిత ఆశయం కోసం పట్టుదలగా చదివి నీట్ పరీక్షలో ఎస్టీ విభాగంలో 108వ ర్యాంకు సాధించింది. కౌన్సెలింగ్ లో మంచిర్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు సాధించింది. అయితే అడ్మిషన్ ఫీజు, ట్యూషన్ ఫీజులు, గ్రంథాలయ రుసుము, పుస్తకాలకు కలిపి దాదాపు రూ.1.30 లక్షలు ఖర్చు అవుతుందని తెలిసింది. అంత పెద్ద మొత్తం డబ్బులు కట్టలేక, ఎవరైనా దాతలు సాయంచేయాలని సాయిశ్రద్ధ తల్లిదండ్రులు వేడుకుంటున్నరు. దాతలు 8096343001 నెంబర్ సాయం చేయాలని జ్ఞానేశ్వర్ దంపతులు కోరుతున్నారు. విద్యార్థిని పరిస్థిని ఈనాడు పేపర్ ప్రచురించింది. ఈ కథనంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఇవాళ బాలికకు ఆర్థిక సాయం అందించారు.