కన్నడ నటుడు దర్శన్ కు కర్ణాటక హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. వైద్య చికిత్స కోసం ఈ బెయిల్ మంజూరు చేసినట్లు సింగిల్ జడ్జ్ వెల్లడించారు. ఆరు వారాల పాటు దర్శన్ కు బెయిల్ మంజూరు అయ్యింది. అయితే రేణుకా స్వామి హత్య కేసులో దర్శన్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. జూన్ 11న దర్శన్ ను కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేశారు.