ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం (దీపం-2) బుకింగ్ ప్రారంభం అయ్యింది. అక్టోబర్ 29 ఉదయం 10 గంటల నుంచి లబ్దిదారులు నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలకు బంధించి ఉచిత గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవచ్చు. దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్ పొందిన వారు రేషన్ కార్డు, ఆధార్ కార్డులతో గ్యాస్ డీలర్ ను సంప్రదించి ఈ-కేవైసీ చేయించుకోవాలి. అనతరం గ్యాస్ బుక్ చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీకు ఎస్ఎంఎస్ వస్తుంది. దీంతో మీరు ఉచిత గ్యాస్ పథకానికి అర్హులుగా నిర్థారించుకోవచ్చు. అయితే లబ్దిదారులు ముందుగా నగదు చెల్లించి సిలిండర్ను తీసుకుంటే 2 రోజుల్లో డబ్బును ఖాతాల్లో జమ చేస్తుంది. లబ్దిదారులకు ఏదైనా సమస్య ఎదురైతే టోల్ ఫ్రీ నెంబర్ 1967కి ఫోన్ చేయవచ్చు. ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంలో మొదటి సిలిండర్ను మార్చి31వ తేదీలోపు, రెండోది జులై 31, మూడోది నవంబర్ 30లోపు సిలిండర్లను పొందవచ్చు.
Home Andhra Pradesh Free Gas Cylinder eKYC:ఉచిత గ్యాస్ సిలిండర్ల స్కీమ్ ఈ-కేవైసీ ఎలా చేయించాలి? బ్యాంక్ ఖాతా...