సీఎం రేవంత్ రెడ్డి.. స్పెషల్ పోలీసులకు భయపడి వాళ్లని తీసేసి ఆర్మ్ డ్ పోలీసులను పెట్టుకన్నారని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఆర్మ్డ్ పోలీసులకు కూడా భయపడితే, చంద్రబాబును అడిగి ఆంధ్ర పోలీసులను తెచ్చుకుంటావా? లేదా పోయి ఆంధ్రలో కూర్చుంటావా? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డికి అల్లుడు ఉన్నాడు కాబట్టి ఆంధ్రలో ఉంటాడేమో.. మరి మంత్రులు ఎటు వెళ్తారని అడిగారు జగదీష్ రెడ్డి.