అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం చరమాంకానికి చేరకుంది. డెమొక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్, రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ విస్తృతంగా ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫిలడెల్ఫియాలో మాట్లాడుతూ.. భారత్‌లో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగినట్లుగా అమెరికాలో రిగ్గింగ్ జరగకూడదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేపిటల్ బిల్డింగ్‌ పై దాడి ఘటన పునరావృత్తం కాకూడదు ఆకాంక్షిచారు. పూర్తి స్వేచ్ఛాయుత వాతావరణంలో పారదర్శకంగా అమెరికా అధ్యక్ష ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని అక్కడి ప్రజలకు కేఏ పాల్ పిలునిచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here