కిరణ్ అబ్బవరం నటించిన ‘క’ మూవీ అక్టోబర్ 31న రిలీజ్ కాబోతోంది. హైదరాబాద్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్గా జరిగింది. అక్కినేని నాగ చైతన్య ప్రత్యేక అతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా కిరణ్ అబ్బవరం తనపై ఓ సినిమా చేసిన ట్రోల్స్ గురించి ఫైర్ అయ్యారు. అసలు మీ సినిమాలో ట్రోల్ చేసేంత ద్రోహం మీకు ఏం చేశానని ప్రశ్నించారు.