ప్రమాణ స్వీకారంలా ఈ వీడియోలో ఎన్టీఆర్ మాటలు సాగాయి. “మన చలన చిత్ర పరిశ్రమ పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, దాని సమగ్రతను కాపాడతానని.. కథా రచయిత, దర్శక, నిర్మాతల సంతృప్తి మేరకు కథలు, సన్నివేశాలు, పాత్రలకు అనుగుణంగా నటించి ప్రేక్షకులను రంజింపచేయడంలో నావంతు నిరంతర కృషి చేస్తానని నా ముత్తాత, నా దైవం విశ్వవిశ్వాత నటసౌర్యభౌమ, నటరత్న, పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారకరామారావు సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను” అని ఎన్టీఆర్ చెప్పారు. ఏ.. తమ్మడూ విష్‍యూ ఆల్ గుడ్‍లక్ అని ఎన్టీఆర్‌ను వైవీఎస్ చౌదరి విష్ చేయడంతో ఈ వీడియో ముగిసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here