ఎలాన్ మస్క్ కు ఎంతమంది పిల్లలు, ఎంతమంది భార్యలు?
టెస్లా స్థాపకుడు ఎలాన్ మస్క్ కు 11 మంది పిల్లలు ఉన్నారని చెబుతారు. అయితే కొందరు మాత్రం 11 కాదు, 12 మంది పిల్లలు అని చెబుతున్నారు. వీరిలో ముగ్గురు వేర్వేరు భాగస్వాముల ద్వారా జన్మించిన వారు ఉన్నారు. ఆ ముగ్గురిలో ఇద్దరితో మస్క్ విడిపోయారు. మరొకరితో కలిసి ఉంటున్నారు. శివోన్ జిలిస్ కు ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు. వారు స్ట్రైడర్, అజూర్. ఈ సంవత్సరం మొదట్లో జన్మించిన మరో బిడ్డ పేరును ఇంకా వెల్లడించలేదు. మస్క్ తో సింగర్ గ్రిమ్స్ ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చారు. వారు ఎక్స్ ఏఈ ఏ-12 అనే 4 ఏళ్ల కుమారుడు, రెండేళ్ల కుమార్తె ఎక్సా డార్క్ సిడెరెల్, టెక్నో మెకానిక్స్ అనే రెండేళ్ల కుమారుడు ఉన్నారు. పిల్లల సంరక్షణకు సంబంధించి మస్క్, గ్రిమ్స్ ఇద్దరూ న్యాయపోరాటం చేస్తున్నారు. మస్క్, గ్రిమ్స్ మధ్య 17 సంవత్సరాల వయస్సు వ్యత్యాసం ఉంది. ఈ జంట 2021 లో విడిపోతున్నట్లు ప్రకటించారు. 2023 ఆగస్టులో గ్రిమ్స్ తమ ఇద్దరు పిల్లలతో కలిసి కాలిఫోర్నియాకు వెళ్లిన తర్వాత మస్క్ (elon musk) పై దావా వేశారు. అంతేకాకుండా, తన ట్రాన్స్జెండర్ కుమార్తె వివియన్ జెన్నా విల్సన్ గురించి మస్క్ చేసిన వ్యాఖ్యలను గ్రిమ్స్ బహిరంగంగా విమర్శించారు.