నిఖిల్ సిద్ధార్థ్ “అప్పుడో ఇప్పుడో ఎప్పుడో” అంటూ ఆడియెన్స్‌ను ఆకట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. సుధీర్ వర్మ ఈ చిత్రానికి దర్శకుడు. స్వామి రారా, కేశవ తర్వాత.. నిఖిల్, సుధీర్ వర్మల కలయికలో వస్తున్న హ్యాట్రిక్ మూవీ ఇది. (Appudo Ippudo Eppudo)

రీసెంట్‌గా విడుదలైన టీజర్, ఫస్ట్ సింగిల్‌ ‘హే తార’ ఆకట్టుకున్నాయి. ఇక ఇప్పుడు సెకండ్ సింగిల్ ‘నీతో ఇలా’ అంటూ సాగే పాటని మంగళవారం నాడు మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ మెలోడియస్ ట్రాక్‌లో నిఖిల్, దివ్యాంశ కౌశిక్ కెమిస్ట్రీ ఆకట్టుకునేలా ఉంది. కార్తీక్ అందించిన బాణీ, రాకేందు మౌళి సాహిత్యం, కార్తీక్, నిత్యశ్రీ గాత్రం ఈ మెలోడీ గీతాన్ని మరింత ప్రత్యేకంగా మలిచాయి. 

ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యోగేష్ సుధాకర, సునీల్ షా, రాజా సుబ్రమణ్యం ఈ చిత్రానికి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. కన్నడ నటి రుక్మిణి వసంత్ ఈ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అవుతోంది. 

సింగర్ కార్తీక్ పాటలు కంపోజ్ చేస్తుండగా, సన్నీ ఎంఆర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీని, నవీన్ నూలి ఎడిటింగ్‌ బాధ్యతల్ని నిర్వహిస్తున్నారు. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో నవంబర్ 8న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here