సాయంత్రం 5 వరకే..

దీపావళి పండుగ సందర్భంగా తమ వినియోగదారులకు రిలయన్స్ గ్రూప్ సంస్థ జియో బీపీ ఒక బంపర్ ఆఫర్ ను ప్రకటించింది. తమ గ్రూప్ పెట్రోలు బంక్ ల్లో పెట్రోలు కొనుగోలు చేసిన వినియోగదారులకు లీటర్ పెట్రోలుపై 3 రూపాయల తగ్గింపు ఆఫర్ ను ప్రకటించింది. ఈ డిస్కౌంట్ కేవలం అక్టోబర్ 31వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ విషయాన్ని జియో (jio) బీపీ తన అన్ని ఔట్ లెట్స్ వద్ద ప్రకటనల రూపంలో తెలియజేసింది. అలాగే, ఫేస్ బుక్, వాట్సాప్, ఇన్ స్టా వంటి తమ అన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ లో ఈ ఆఫర్ విషయాన్ని వెల్లడించింది. ఈ డిస్కౌంట్ ఆఫర్ తో పాటు లక్కీ డ్రా స్కీమ్ ను కూడా ప్రకటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here