ముహూర్త ట్రేడింగ్ సెషన్ ఎందుకు ముఖ్యమైనది?
భారతదేశంలో, స్టాక్ బ్రోకర్లు దీపావళిని తమ ఆర్థిక సంవత్సరం ప్రారంభంగా చూస్తారు. చాలా మంది ఇన్వెస్టర్లు ఈ కాలంలో స్టాక్స్ కొనుగోలును రాబోయే సంవత్సరానికి శ్రేయస్సును ఆహ్వానించే మార్గంగా చూస్తారు. ట్రేడర్లు తమ పోర్ట్ ఫోలియోలను పరిశీలించి, అవసరమైన మార్పులు చేయడానికి, కొత్త సెటిల్మెంట్ ఖాతాలను తెరవడానికి దీపావళి సమయాన్ని ఎన్నుకుంటారు. ఎక్కువగా ప్రతీకాత్మకంగా ఉన్నప్పటికీ, ముహూరత్ ట్రేడింగ్ (muhurat trading) సమయంలో అనుభవజ్ఞులైన పెట్టుబడిదారులు వారి పోర్ట్ ఫోలియోలను సర్దుబాటు చేస్తారు. అయితే, ట్రేడింగ్ (trading) సెషన్ గంట పాటు మాత్రమే కొనసాగుతున్నందున మార్కెట్ (stock market) హెచ్చుతగ్గులు చాలా అస్థిరంగా ఉంటాయి. నవంబర్ 1 సమీపిస్తుండటంతో అనుభవజ్ఞులైన ఇన్వెస్టర్లు, కొత్తవారు ఈ ఫెస్టివల్ మార్కెట్ ఈవెంట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.