శుక్రుడు ప్రస్తుతం వృశ్చికరాశిలో ఉన్నాడు. దీపావళి తర్వాత ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ సంవత్సరం దీపావళిని కొన్ని ప్రాంతాల్లో అక్టోబర్ 31 జరుపుకుంటే, మరికొందరు నవంబర్ 1 న జరుపుకుంటారు. దీపావళి తర్వాత శుక్రుడు ధనుస్సు రాశిలోకి వెళ్లడం వల్ల మొత్తం 12 రాశుల వారిపై ప్రభావం పడుతుంది. కొన్ని రాశులు సాధారణంగా ఉంటే కొంతమందికి ప్రయోజనకరమైన ఫలితాలు ఉంటాయి. జ్యోతిష్య శాస్త్ర లెక్కల ప్రకారం మేష, కన్య, కుంభ రాశుల వారికి ధనుస్సు రాశిలో శుక్రుని సంచారం శుభప్రదం అవుతుంది. ఈ రాశిచక్రాలపై శుక్రుడి ప్రభావం కారణంగా ఎలాంటి ఫలితాలు ఎదురవుతాయో చూద్దాం.