టీవీఎస్ స్కూటీ జెస్ట్ స్కూటర్ రూ.72,614 నుండి రూ.73,417 ధరతో ఉంది. ఇందులో 109.7 సిసి పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఇది 7500 ఆర్పీఎమ్ వద్ద 7.8 PS హార్స్ పవర్, 8.84 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 48 కిలోమీటర్ల వరకు మైలేజీని అందిస్తుంది. కొత్త టీవీఎస్ స్కూటీ జెస్ట్ మ్యాట్ బ్లాక్, మ్యాట్ బ్లూ, మ్యాట్ పర్పుల్, మ్యాట్ రెడ్ వంటి వివిధ ఆప్షన్స్‌లో కూడా అందుబాటులో ఉంది. దీని బరువు 103 కిలోలు, 5-లీటర్ కెపాసిటి గల ఇంధన ట్యాంక్‌ను కలిగి ఉంది.