జులై 2న రూ.5,000 కోట్లు..
జులై 2న నిర్వహించిన స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ వేలంలో.. రూ. 5,000 కోట్ల (ఒక్కొక్కటి రూ.1,000 కోట్లు చొప్పున ఐదు బాండ్లు) అప్పు కోసం ప్రభుత్వం ఇండెంట్ పెట్టింది. ఇందులో రూ.1,000 కోట్ల విలువ చేసే ఐదు సెక్యూరిటీ బాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వేలానికి పెట్టింది. మొదటి రూ.1,000 కోట్ల బాండు 9 ఏళ్లు, రెండో రూ.1,000 కోట్ల బాండు 12 ఏళ్లు, మూడు రూ.1,000 కోట్ల బాండు17 ఏళ్లు, నాలుగో రూ.1,000 కోట్ల బాండు 21 ఏళ్లు, ఐదో రూ.1,000 కోట్ల బాండు 24 ఏళ్ల కాల పరిమితి ఉంటుంది.