రాష్ట్రీయ ఏక్తా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. అదేవిధంగా ఒకే ఐడెంటిటీ ఉండటం కోసం ఆధార్‌ను కూడా తీసుకువచ్చామని చెప్పారు. ఇదే క్రమంలోనే పరిపాలన క్రమ పద్ధతిలో సాఫీగా సాగేందుకు దేశంలో ఒకే ఎన్నిక విధానం తెచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశామని పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. ఈ వ్యాఖ్యలపై పలువురు స్పందించారు. త్వరలో జమిలి ఎన్నికలకు సూచన మోది మాటలేనని అంటున్నారు.