పోషకాహార నిపుణులు క్రీము ఎక్కువ కాలం తాజాగా ఉండాలని ఉప్పును అధికంగా కలుపుతున్నారు. ఇలా ఉప్పగా ఉండే పదార్థాలు తింటే త్వరగా అధిక రక్తపోటు బారిన పడతారు. హైబీపీకి, గుండె జబ్బులకు దగ్గర సంబంధం ఉంటుంది. కాబట్టి ఆ జీవితాంతం ఆరోగ్యంగా ఉండాలంటే మీ పిల్లలకు కూడా మయో నైస్ ను పెట్టకపోవడమే ఉత్తమం. మయోనైస్ ఎక్కువ మొత్తంలో తీసుకుంటే పొట్ట ఉబ్బరం, అతిసారం వంటి సమస్యలు కనిపిస్తాయి. జీర్ణ సమస్యలు ఎక్కువ అవుతాయి. మయోనైస్ తిన్నాక మీకు జీర్ణ వ్యవస్థలో అసౌకర్యంగా అనిపిస్తే జాగ్రత్తపడండి. మయోన్నైస్లో అనేక రకాల రసాయనాలు కూడా కలిపి నిల్వ చేసేందుకు ప్రయత్నిస్తారు. ఇలాంటివి శరీరంలో చేరడం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే అవకాశం ఎక్కువ. కాబట్టి వీలైనంత వరకు క్రీములకు దూరంగా ఉండి ఇంట్లో చేసుకున్న ఆహారాన్ని తినడం ఉత్తమం.