పుష్ప  పార్ట్ 1(pushpa)ద్వారా తెలుగు ప్రేక్షకులని ఆకట్టుకున్న కన్నడ నటుడు ధనుంజయ్. అందులో జాలి రెడ్డి అనే క్యారక్టర్ లో ఎంతో  పవర్ ఫుల్ గా చేసి చిత్ర విజయంలో తను కూడా ఒక భాగమయ్యాడని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇప్పుడు పుష్ప పార్ట్ 2(pushpa 2)లోను తన సత్తా చాటబోతున్నాడు.

రీసెంట్ గా ధనుంజయ్(dhananjaya)కి ధన్యత అనే అమ్మాయితో నిచ్చితార్ధం జరిగింది. కర్ణాటకలోని చిత్ర దుర్గం ఏరియాకి చెందిన ధన్యత డాక్టర్ గా వర్క్ చేస్తుంది. చాలా కాలంగా ఈ ఇద్దరు ప్రేమలో ఉన్నారు.ఇప్పుడు ఇరు వైపుల కుటుంబ సభ్యుల ఒప్పుకోవడంతో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు.

2013 లో డైరెక్టర్స్ స్పెషల్ అనే కన్నడ మూవీతో సినీ రంగ ప్రవేశం చేసిన ధనుంజయ్ పలు తెలుగు తమిళ, కన్నడ భాషల్లో కలిపి సుమారు ముప్పై చిత్రాల దాకా నటించాడు.కొన్ని చిత్రాలని నిర్మాతగా వ్యవహరించడమే కాకుండా పాటల రచయితగా కూడా తన సత్తా చాటుతున్నాడు.

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here