పండుగల వచ్చాయంటే రకరకాల వంటకాలతో భోజనాలు ముగిస్తారు. ఒక్కోసారి అతిగా తినేస్తూ ఉంటారు కూడా. అలాగే స్వీట్లు, వేపుళ్లు తినే వారి సంఖ్య కూడా ఎక్కువే. దీనివల్ల ఒక్కోసారి పొట్ట ఉబ్బరంగా అనిపిస్తుంది. పొట్టలో ఏదో తెలియని ఇబ్బంది. అనేక రకాల ఆహారాలు అతిగా తినడం వల్ల జీర్ణక్రియ కూడా దెబ్బతింటుంది. ఫలితంగా అజీర్ణం, ఉబ్బరం, గ్యాస్ సమస్యలే కాదు శరీరంలో కొవ్వు కూడా పెరగడం మొదలవుతుంది. మీరు మీ జీర్ణవ్యవస్థను తిరిగి ట్రాక్ లోకి తీసుకురావాలన్నా…ప్రేగులను పూర్తిగా శుభ్రపరచాలనుకున్నా డిటాక్స్ డ్రింక్స్ తాగడం ప్రారంభించండి. ఇక్కడ మేము డిటాక్స్ డ్రింక్స్ రెసిపీలు ఇచ్చాము. వీటిని భారీ భోజనాల అనంతరం తాగడం వల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది. ఆహారం పూర్తిగా జీర్ణమై పేగులు శుభ్రపడతాయి.