AP Telangana Weather Updates : ఏపీ, తెలంగాణలో మరో మూడు నాలుగు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలుచోట్ల ఉరుములతో కూడిన వానలు పడొచ్చని ఐఎండీ అంచనా వేసింది. శుక్రవారం హైదరాబాద్ నగరంలో వర్షం దంచికొట్టింది. దీంతో పలు కాలనీలు జలమయమయ్యాయి.