నకిలీ బెదిరింపులే..

సల్మాన్ ఖాన్, సిద్ధిఖీలకు బెదిరింపు మెసేజ్ పంపిన మరుసటి రోజే ఎస్వీ రోడ్డులోని బ్లూ ఫ్లేమ్ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న ముస్తఫాను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ‘‘సల్మాన్ ఖాన్, జీషాన్ సిద్ధిఖీల నుంచి రూ.2 కోట్లు డిమాండ్ చేస్తూ మంగళవారం గుర్తుతెలియని నంబర్ నుంచి మెసేజ్ వచ్చింది. తన డిమాండ్ తీర్చకపోతే చంపేస్తానని బెదిరించాడు’’ అని ఓ పోలీసు అధికారి తెలిపారు. ఆ సందేశం ఫేక్ అని తాము అనుమానించామని, అయితే సాంకేతిక వివరాల ద్వారా పంపిన వ్యక్తిని గుర్తించే ప్రయత్నాలు ప్రారంభించామని చెప్పారు. ఒక్కరోజులోనే అతడిని అతడి ఇంటి నుంచి అరెస్టు చేశాం’ అని పోలీసు అధికారి తెలిపారు. ముస్తఫా గతంలో సౌదీ అరేబియాలో పనిచేసేవాడని, ఇక్కడికి తిరిగి వచ్చిన తరువాత ఇప్పుడు ఏమీ పని చేయడం లేదని పోలీసులు తెలిపారు. ఆయన కొడుకు ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడని వివరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here