రోజుకు 10-12 వేల స్మార్ట్ కార్డులు

కొత్త వాహ‌నం కొనుక్కుని, ర‌వాణా శాఖ‌లో రిజిస్ట్రేష‌న్ చేయించుకున్నాక ఇచ్చే రిజిస్ట్రేష‌న్ స‌ర్టిఫికేట్ (ఆర్‌సీ), డ్రైవింగ్ లైసెన్స్ పొందిన‌ప్పుడు అంద‌జేసే డీఎల్ కార్డుల జారీకి ప్రక్రియ ప్రారంభం అయింది. న‌వంబ‌ర్ నెల నుంచే కార్డులు జారీ చేయ‌నున్నారు. రాష్ట్రంలో రోజుకు స‌గ‌టున 10-12 వేల ఆర్సీ, డీఎల్ కార్డుల చొప్పున నెల‌కు మూడు ల‌క్షలు, ఏడాదికి దాదాపు 36 ల‌క్షల కార్డులు అవ‌స‌రం అవుతాయి. గ‌తంలో జిల్లా ర‌వాణా శాఖ‌, ఆర్టీవో కార్యాల‌యాల్లో వాటిపై వివ‌రాలు ముద్రించి, వాహ‌న‌దారుల ఇళ్లకు స్పీడ్ పోస్టులో పంపేవారు. దీనికోసం రూ.200 ఫీజు, స్పీడ్ పోస్టు ఖ‌ర్చు కూడా వ‌సూలు చేసేవారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here