మన ఇంటి అబ్బాయిలాగా
“థ్యాంక్స్ అనేది చాలా చిన్న మాట. నన్ను గతంలో పక్కింటి కుర్రాడి ఇమేజ్‌తో ప్రేక్షకులు చూశారు. ఇప్పుడు మన ఇంటి అబ్బాయి అని భావిస్తున్నారు. టికెట్స్ కావాలని, ఇంకా థియేటర్స్ పెంచాలనే డిమాండ్ పెరుగుతోంది. సినిమా పరిశ్రమ నుంచి కూడా చాలామంది అప్రిషియేట్ చేస్తున్నారు. అరవింద్ గారు, నాగవంశీ గారు, 14 రీల్స్ రామ్, గోపి గారు వీళ్లంతా శుభాకాంక్షలు తెలిపడం సంతోషంగా ఉంది” అని కిరణ్ అబ్బవరం తెలిపాడు.