పట్టణ, నగరాల్లోని ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన నిబంధనలలో మార్పులు చేయనున్నామని మంత్రి నారాయణ తెలిపారు. 100 గజాలలోపు స్థలంలో నిర్మించే నిర్మాణాలకు ప్లాన్ మినహాయింపుతో పాటు 300 గజాలలోపు ఇంటి నిర్మాణాలకు సులభతరంగా ప్లాన్ మంజూరు చర్యలు చేపడతున్నట్లు వెల్లడించారు. వీఎంఆర్డీఏ పెండింగ్ పనులు, ప్రాజెక్టులపై అధికారులతో చర్చించారు. భోగాపురం ఎయిర్ పోర్టు నుంచి విశాఖను అనుసంధానించేలా రహదారుల నిర్మించాలని ప్రతిపాదనలు చేస్తున్నామన్నారు. మాస్టర్‌ప్లాన్ రహదారుల రూపకల్పన, నిధుల సమీకరణ, విశాఖ మెట్రో రైలు డీపీఆర్, టిడ్కో ఇండ్ల పురోగతిపై చర్చించినట్లు మంత్రి నారాయణ తెలిపారు.
Home Andhra Pradesh ఏపీలో ఇళ్ల నిర్మాణాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం, ఇకపై ఆ నిబంధన నుంచి మినహాయింపు-minister narayana...