HYD Metro | హైదరాబాద్ నగరంలో సోమవారం ఉదయం పలుచోట్ల మెట్రో రైళ్లు నిలిచిపోయాయి. సాంకేతిక లోపం కారణంగానే రైళ్లు నిలిచినట్లు అధికారులు పేర్కొన్నారు. దాదాపు అరగంట పాటు మెట్రో రైళ్లు స్తంభించటంతో ప్రయాణీకులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఉదయం సమయంలో ఆఫీసులకు వెళ్లేందుకు మెట్రో ఎక్కిన ఉద్యోగులు రైళ్లు నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు.