బీఆర్ఎస్ ప్రభుత్వంలో వ్యవసాయేతర భూములకు కూడా రైతు భరోసా ఇచ్చారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం పంట భూములకు మాత్రమే రైతు భరోసా అందించాలని నిర్ణయించింది. రాళ్లు, గుట్టలు, హైవేలు, రోడ్లు, వెంచర్ల భూములకు పెట్టుబడి సాయం ఇచ్చేది లేదని స్పష్టం చేసింది. ఇప్పటికే దీనిపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వాలని రైతులు, రైతు సంఘాలు, ప్రజల నుంచి అభిప్రాయాలు తెలుసుకుంది. దీనిపై కేబినేట్ సబ్ కమిటీని సైతం నియమించింది.