కార్తీక మాసంలో ప్రతి రోజు చేసే స్నానాలు, దీపారాధనలు, పూజలు భక్తుల ఆధ్యాత్మిక ప్రగతికి, శ్రేయస్సుకు దోహదపడతాయి. కార్తీక మాసంలో స్నానం చేయడం ద్వారా పాప విముక్తి, ఆరోగ్యం, సుఖశాంతులు లభిస్తాయని మన పురాణాలు చెబుతున్నాయని చిలకమర్తి తెలిపారు. సాధారణంగా కార్తీక మాసంలో శివుడు, విష్ణువు ఇతర దేవతల పూజ విశేషమైనదిగా పరిగణిస్తారు. ఈ మాసంలో భగవంతుని పూజకు, ప్రత్యేకంగా స్నానం చేసి పూజించడం ద్వారా భక్తులు పాప విముక్తిని పొందుతారని మన పురాణాలు చెబుతున్నాయి. ఈ మాసం గంగా స్నానానికి ప్రత్యేకమైనదిగా భావించబడుతుంది. అయితే సాధారణ స్నానం కూడా భక్తి, శ్రద్ధతో చేస్తే పుణ్యం లభిస్తుంది.