మెగాపవర్ స్టార్ రామ్ చరణ్(ram charan)భారతీయ చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ దర్శకుడు శంకర్(shankar)ల కాంబోలో  రూపుదిద్దుకుంటున్న చిత్రం గేమ్ చేంజర్(game changer)సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 10 న విడుదల కాబోతుంది.రీసెంట్ గా దీవాలి కానుకగా  రైలు పట్టాల  మీద కొంత మంది రౌడీలని కట్టేసి  గళ్ళ లుంగీ,బ్లాక్ బన్నీ తో బ్లాక్ కళ్ళ జోడు ధరించి కూర్చున్న రామ్ చరణ్ లుక్ రిలీజ్ అయ్యింది. దీంతో మెగా అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కూడా గేమ్ చేంజర్ పై అంచనాలు రెట్టింపు అయ్యాయి.

ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన టీజర్ రిలీజ్ ఫంక్షన్ ఈ నెల తొమ్మిదవ తారీఖున ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో జరగనుంది.చిత్రం బృందం ఈ మేరకు అధికారకంగా ప్రకటించడంతో మెగా అభిమానులో సందడి వాతావరణం నెలకొని ఉంది.శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై  దిల్ రాజు(dil raju)తన కెరిరీలో ఫస్ట్ టైం అత్యంత భారీ వ్యయంతో గేమ్ చేంజర్ ని  నిర్మిస్తుండగా చరణ్ సరసన కియారా అద్వానీ(kiyara adwani)జతకడుతుండగా అంజలి(anjali)మరో హీరోయిన్ గా చేస్తుంది.

 

ఎస్ జె సూర్య, శ్రీకాంత్,ప్రకాష్ రాజ్, సముద్ర ఖని,జయరాం, నవీన్ చంద్ర,మురళి శర్మ సునీల్ వంటి మేటి నటులు కీలక పాత్రల్లో చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు ప్రేక్షకులని విశేషంగా అలరిస్తున్నాయి. థమన్(thaman)సంగీతాన్ని అందించగా తమిళ సినిమా రంగానికి చెందిన తిరు(tiru)కెమెరా బాధ్యతలని నిర్వహిస్తున్నాడు.

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here